ముగిసిన అనంత్ కుమార్ అంత్యక్రియలు.. హాజరైన అద్వాణీ, అమిత్ షా
13-11-2018 Tue 15:20
- బీజేపీ కార్యాలయంలో నివాళి అర్పించిన వెంకయ్య
- చామరాజపేట్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
- ఊపిరితిత్తుల కేన్సర్ తో తుదిశ్వాస విడిచిన అనంత్ కుమార్

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అంత్యక్రియలు బెంగళూరులో అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. అంత్యక్రియలకు బీజేపీ అగ్రనేత అద్వాణీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్ తో పాటు కర్ణాటక బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ నేతలు హాజరై... తుది వీడ్కోలు పలికారు.
ఈ ఉదయం ఆయన భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని నేషనల్ కళాశాల మైదానానికి తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర చేపట్టి... చామరాజపేట్ శ్మశానవాటికలో అంతిమసంస్కారాలను నిర్వహించారు. ఊపిరితిత్తుల కేన్సర్ తో అనంత్ కుమార్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
5 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
5 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
5 hours ago
