హాట్ టాపిక్ గా మారిన అల్లు అర్జున్ టీషర్ట్
Advertisement
విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా' చిత్రం నిర్మితమైంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేడుకకి అల్లు అర్జున్ ధరించి వచ్చిన టీషర్ట్ పైనే అందరి చూపులు పడ్డాయి.

ఫంక్షన్ అయిన తరువాత చాలామంది ఆ టీషర్ట్ ఖరీదు తెలుసు కోవడానికి ఆసక్తిని చూపించారు. ఆ టీషర్ట్ ఖరీదు 65 వేలకి పైగా ఉండటంతో ఆశ్చర్యపోయారు. బన్నీ వాడిన ఆ టీషర్ట్ ఖరీదు గురించే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ టీషర్ట్ ధరతో కూడిన ట్యాగ్ ను .. అల్లు అర్జున్ టీషర్ట్ ఫోటోను సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్, ఆ తరువాత అందరూ తన టీషర్ట్ గురించి మాట్లాడుకునేలా చేయడం విశేషం.   
Tue, Nov 13, 2018, 10:53 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View