రెడ్లకే అత్యధికం... కాంగ్రెస్ తొలి జాబితాలో కులాలు, వర్గాల వారీ కేటాయింపుల వివరాలు!
Advertisement
గత రాత్రి న్యూఢిల్లీలో ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో 65 మందికి సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో 23 మంది రెడ్డి వర్గానికి చెందిన నేతలు టికెట్లను దక్కించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 39 మందికి, వెలమ వర్గానికి చెందిన ముగ్గురికి, ఓ బ్రాహ్మణ వర్గం వ్యక్తికి చోటు లభించింది. జనాభాలో సగభాగమున్న బీసీ కులాలకు 30 సీట్ల వరకూ ఇస్తామని తొలుత ప్రకటించిన కాంగ్రెస్, తొలి జాబితాలో 13 మందికి స్థానం కల్పించింది.

ఈ జాబితాలో ఐదుగురు మున్నూరు కాపులు, నలుగురు గౌడ్ లు, పద్మశాలీ, యాదవ కులాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మొత్తం జాబితాలో 10 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా, ఈ జాబితాలో 32 చోట్ల గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల మార్పు కనిపించగా, మరో ఇద్దరికి స్థానాలను కాంగ్రెస్ అధిష్ఠానం మార్చింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి, టీఆర్ఎస్ లోకి వెళ్లిన అన్ని నియోజకవర్గాల్లో ఇతరులకు టికెట్లను కేటాయించారు.
Tue, Nov 13, 2018, 10:33 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View