కేసీఆర్ పాలనలో 4500 మంది ఆత్మహత్య చేసుకున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశించారని... కానీ, టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. అయినా, మృతుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదని అన్నారు. రాహుల్ గాంధీ 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, రైతులకు సంఘీభావం తెలిపారని చెప్పారు. డిసెంబర్ నెలలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని తెలిపారు. 
Sat, Oct 20, 2018, 04:00 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View