నిర్మాతగా మారుతోన్న బన్నీ .. సొంత బ్యానర్ కి సన్నాహాలు?
Advertisement
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై యువ హీరోలతో సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడు. ఇక చరణ్ కూడా సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. చిరంజీవి 150వ సినిమా అయిన 'ఖైదీ నెంబర్ 150' ఈ బ్యానర్ పైనే రూపొందింది. ఇప్పుడు 'సైరా' కూడా భారీ బడ్జెట్ తో ఇదే బ్యానర్లో రూపొందుతోంది.

ఇక ఇదే ఫ్యామిలీకి చెందిన బన్నీ కూడా సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ఆల్రెడీ వీరికి గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉన్నప్పటికీ, అది అల్లు అరవింద్ వారసులందరికీ చెందినది అవుతుంది. అందువలన తనకంటూ ఒక బ్యానర్ ఉండాలనే ఆలోచనతో బన్నీ అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టాడని అంటున్నారు. ఈ బ్యానర్ పై వరుసగా చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించాలనే దిశగా ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం.    
Sat, Oct 20, 2018, 03:43 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View