చాలా కథలు పక్కన పెట్టేసి 'శ్వాస' చేస్తున్నాను : హీరో నిఖిల్
Advertisement
విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ .. వరుస సినిమాలు చేసుకుంటూ నిఖిల్ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ముద్ర' త్వరలో ప్రేక్షకులముందుకు రావడానికి ముస్తాబవుతోంది. నిఖిల్ తదుపరి ప్రాజెక్టు కూడా లైన్లో రెడీగా వుంది. నిన్ననే ఈ సినిమాకి 'శ్వాస' అనే టైటిల్ ను ఖరారు చేసి పోస్టర్ ను వదిలారు.

ఈ సినిమాను గురించి నిఖిల్ మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో నేను విన్న కథల్లో 'శ్వాస' అనే కథ నాకు బాగా నచ్చింది. ముందుగా నేను అనుకున్న కథలను పక్కన పెట్టేసి మరీ ఈ సినిమా చేస్తున్నాను. కథలో చాలా వేరియేషన్స్ వున్న కారణంగా, ఈ సినిమాకి చాలా సమయం పడుతుందని అనుకుంటున్నాను .. అందువల్లనే ఏకధాటిగా 6 నెలల సమయాన్ని కేటాయించాను. దర్శకుడి ప్రతిభపై గల నమ్మకంతోనే రంగంలోకి దిగుతున్నాను. తెలుగు బాగా తెలిసిన నివేదా థామస్ తో కలిసి పనిచేయనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది' అన్నాడు. 
Sat, Oct 20, 2018, 02:59 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View