‘సడక్’ సినిమా చూసి, అమ్మను నాన్న చంపేశారనుకుని చాలా భయపడిపోయా!: ఆలియాభట్
Advertisement
27 సంవత్సరాల తర్వాత బాలీవుడ్ సినిమా ‘సడక్‌’కి సీక్వెల్ రాబోతోంది. దానికి ‘సడక్ 2’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ‘సడక్‌’ అప్పట్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సంజయ్ దత్, పూజా భట్ జంటగా నటించారు. అయితే ‘సడక్ 2‌’... సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఆలియా భట్ జంటగా మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

ఇక ‘సడక్’ సినిమా సమయంలో తాను చిన్నపిల్లనని చెప్పిన ఆలియా, అప్పుడు ఆ సినిమా చూసిన నాటి అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. ‘సడక్‌ చిత్రాన్ని చిన్న వయసులో ఇంట్లో చూశా. ఈ చిత్రంలో అమ్మానాన్నలు కూడా చిన్న పాత్రల్లో కనిపించారు. సినిమాలో అమ్మను నాన్న కిటికీ నుంచి బయటకు విసిరేసే సన్నివేశం ఒకటుంది. చిన్నతనం కదా, అది సినిమా అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. అమ్మను నాన్న చంపేశారనుకున్నా. ఆ సన్నివేశాన్ని పాజ్ చేశాను. నాన్నను పిలిచి ఎందుకలా చేశారని ప్రశ్నించా’’ అని చెప్పుకొచ్చింది ఆలియా.

ఇక సడక్ 2 గురించి చెబుతూ, 'మా నాన్న దర్శకత్వంలో మొదటిసారి నటించబోతున్నా. ఒక కూతురికి ఇంతకన్నా గొప్ప కానుక మరేది ఉండదు' అని తెలిపింది. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే, సంజయ్, పూజ కూడా అతిథి పాత్రల్లో నటించనున్నారు.
Wed, Sep 26, 2018, 06:26 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View