'జెర్సీ' కోసం పడుతోన్న కష్టం మాములుగా లేదు: నాని
Advertisement
నాని తాజా చిత్రంగా రూపొందిన 'దేవదాస్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాని, తదుపరి సినిమా అయిన 'జెర్సీ'ని గురించి ప్రస్తావించాడు. "ఈ సినిమాలో నేను పూర్తిస్థాయి క్రికెటర్ గా కనిపిస్తాను .. బౌలర్ గా కాదు .. బ్యాట్స్ మెన్ గా. పదో తరగతి వరకూ నేను క్రికెట్ ఆడేవాడిని .. ఆ తరువాత మానేశాను. మళ్లీ ఇన్నాళ్లకి ఈ సినిమా కోసం బ్యాట్ పట్టుకోవలసి వచ్చింది.

ఈ సినిమా కోసం ప్రతిరోజు మూడున్నర గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ దగ్గర కూడా లేనంత క్రికెట్ ఎక్విప్ మెంట్ ఇప్పుడు నా ఇంట్లో ఉందంటే ఏ స్థాయిలో కష్టపడుతున్నానో అర్ధమయ్యే ఉంటుంది. ఈ సినిమా తరువాత టాలీవుడ్ సినీతారల క్రికెట్ పోటీలు పెడితే నేనే బెస్ట్ ప్లేయర్ ను అవుతాను. ఈ సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను .. నా పాత్ర కొత్తగా అనిపిస్తుంది. దసరా రోజున ఈ సినిమాను లాంచ్ చేస్తున్నాం" అంటూ నాని చెప్పుకొచ్చాడు.  
Wed, Sep 26, 2018, 04:52 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View