శ్రీను వైట్లకి శుభాకాంక్షలు తెలియజేసిన రవితేజ
Advertisement
ఒకప్పుడు వరుస విజయాలను అందించిన శ్రీను వైట్ల .. ఆ తరువాత వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రవితేజతో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. కథాపరంగా ఈ సినిమా చాలావరకూ విదేశాల్లోనే షూటింగు జరుపుకుంటోంది. ఈ రోజున శ్రీను వైట్ల పుట్టినరోజు .. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయనకి రవితేజ శుభాకాంక్షలు అందజేశారు. అంతే కాకుండా ఈ సినిమాలో తన షాట్స్ కి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఆయన జోడీగా ఇలియానా కనిపించనున్న సంగతి తెలిసిందే.      
Mon, Sep 24, 2018, 11:26 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View