శృతి, సాగర్ ల హత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇంత వరకు సమాధానం లేదు: విజయశాంతి
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. అణచివేత ఎక్కడున్నా... అక్కడ తిరుగుబాటు వస్తుందని చెప్పారు. వరంగల్ జిల్లా బిడ్డలు శృతి, సాగర్ ల పైశాచిక హత్యలపై కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు సమాధానం చెప్పలేదని విమర్శించారు. చంపడం అనేదాన్ని ఎవరు చేసినా తప్పే అని... ప్రభుత్వాలకు కూడా దీన్నించి మినహాయింపు లేదని అన్నారు. గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు దాదాపు దూరంగా ఉన్న విజయశాంతి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆమెను స్టార్ క్యాంపెయినర్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 
Mon, Sep 24, 2018, 11:01 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View