ఆ నియమాన్ని సిరివెన్నెల గారు చెప్పిన దగ్గర నుంచే పాటిస్తున్నా!: గీత రచయిత అనంత్ శ్రీరామ్
Advertisement
యువ గేయ రచయితగా అనంత్ శ్రీరామ్ కి మంచి పేరుంది. తాజాగా ఆయన 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఆయన రాసిన 'స్వాతికిరణం'లోని పాటలన్నీ కూడా చాలా ఇష్టం. సిరివెన్నెల గారిని చాలాసార్లు కలిశాను.

ఎప్పుడు కలిసినా పాట రాసేటప్పుడు పాటించవలసిన విలువలను గురించి ఆయన చెబుతుంటారు. వాటిని నేను తుచ తప్పకుండా పాటిస్తూ వుంటాను. నేను పాట రాసేటప్పుడు వ్యర్థ అక్షరాలు లేకుండగా చూసుకుంటాను. అప్పుడు పాట సహజంగానే కాకుండా సరళంగాను ఉంటుంది. ఈ నియమాన్ని కూడా సిరివెన్నెల గారు చెప్పిన దగ్గర నుంచే నేను పాటిస్తూ వస్తున్నాను" అని చెప్పుకొచ్చారు .   
Mon, Sep 24, 2018, 10:58 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View