నేడు ఏలూరులో పర్యటించనున్న పవన్ కల్యాణ్!
Advertisement
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించనున్నారు. ఈ రోజు ఏలూరుకు చేరుకునే పవన్.. వివిధ వర్గాలు, సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యార్థులతో రేపు ఏలూరు మినీబైపాస్ రోడ్డులోని క్రాంతి కల్యాణ మండపంలో సమావేశమవుతారు. అనంతరం బుధవారం ఉంగుటూరు నియోజకవర్గంలో ‘పోరాట యాత్ర’ బహిరంగ సభను నిర్వహిస్తారు. అయితే ఎక్కడ ఈ సభ జరుగుతుందనేది ఇంకా ఖరారు కాలేదు.

పవన్ ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో రెండు విడతలుగా పర్యటించారు. మూడో విడతలో భాగంగా ఏలూరుకు నేడు చేరుకోనున్నారు. నిన్న నటుడు, కమెడియన్ అలీతో కలసి నెల్లూరు బారా షహీద్ దర్గాను పవన్ కల్యాణ్ దర్శించుకున్న సంగతి తెలిసిందే.
Mon, Sep 24, 2018, 10:39 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View