ముంబైలో తొంబై దాటిన పెట్రోలు ధర
Advertisement
సెంచరీ దిశగా పరుగులు పెడుతున్న పెట్రోలు ధర నేడు ముంబైలో తొంబై రూపాయలను దాటింది. నేడు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. దీంతో ముంబైలో లీటరు పెట్రోలు ధర చరిత్రలో తొలిసారి రూ. 90.08కి చేరింది. ఇదే సమయంలో న్యూఢిల్లీలో రూ. 82.72కు, కోల్ కతాలో రూ. 84.54కు, చెన్నైలో రూ. 85.99కి పెట్రోలు ధర పెరిగింది. ఇక డీజిల్ విషయానికి వస్తే, నేడు ముంబైలో రూ. 78.58, న్యూఢిల్లీలో రూ. 74.02, కోల్ కతాలో రూ. 75.87, చెన్నైలో రూ. 78.26గా ఉంది. అన్ని మెట్రో నగరాల్లో ఢిల్లీలోనే పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. 
Mon, Sep 24, 2018, 09:47 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View