రొట్టెల పండగ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కల్యాణ్..
Advertisement
నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బారాషహీద్ దర్గాలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ వెంట ప్రముఖ హాస్యనటుడు అలీ కూడా ఉన్నారు. దర్గాలో పూజలు నిర్వహించిన అనంతరం స్వర్ణాల ఘాట్ లో రొట్టెను పవన్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టు పవన్ చెప్పారు. కాగా, పవన్ ను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
Sun, Sep 23, 2018, 07:07 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View