వినాయక నిమజ్జనంలో అపశృతి..తెగిపోయిన క్రేన్ తీగలు!
Advertisement
 వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. క్రేన్ తీగలు తెగిపోవడంతో విగ్రహంతో సహా నలుగురు వ్యక్తులు చెరువులో పడిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి స్థానిక నాయిని చెరువు వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. విగ్రహాలను చెరువులోకి దింపేందుకుగాను క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేసే క్రమంలో భాగంగా ఒక్కసారిగా క్రేన్ తీగలు తెగిపోయాయి. దీంతో విగ్రహంతో పాటు జమ్మికుంటకు చెందిన నిరంజన్‌రెడ్డి, ప్రవీణ్, మహేందర్, నరేష్‌లు చెరువులో పడిపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వారిని వెంటనే పైకి తీశారు. వైద్య చికిత్స నిమిత్తం ఆ నలుగురిని ఆసుపత్రికి తరలించారు. 
Sat, Sep 22, 2018, 09:22 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View