రాజకీయాల్లోకి వస్తా.. మీ సంగతి చెబుతా: ప్రబోధానంద
Advertisement
జేసీ సోదరుల అన్యాయాలను ప్రజలకు వివరిస్తామని ప్రబోధానంద తెలిపారు. తాడిపత్రి మండలం చిన్నపొలమడలోని తన ఆశ్రమం వద్ద ఇటీవల జరిగిన విధ్వంసం నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా అజ్ఞాతంలో గడుపుతున్నారు. తాజాగా ఆయన వాట్సాప్‌ ద్వారా ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఈ సందేశంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబంతో ఉన్న విభేదాలపై ప్రబోధానంద తొలిసారిగా పెదవి విప్పారు.

 దివాకర్ రెడ్డి చెప్పినట్టు తన వద్ద ఎలాంటి మారణాయుధాలూ లేవన్నారు. భవన నిర్మాణానికి వాడగా మిగిలిన పోయిన ముక్కలే పోలీసులకు దొరికాయని.. అవి ఘర్షణకు వినియోగించే రాడ్లు కావని స్పష్టం చేశారు. జేసీ సోదరులు పెద్దపొలమడ గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాము రాజకీయాల్లోకి తప్పక వస్తామని ప్రబోధానంద స్పష్టం చేశారు. జ్ఞానబోధ కోసమే ఆశ్రమాన్ని నెలకొల్పామని భగవద్గీతనే ప్రచారం చేస్తున్నామన్నారు.

 అసాంఘిక కార్యకలాపాలు చేయాల్సి అవసరం తమకు లేదని ఈయన తెలిపారు. గతంలో తాము కృష్ణమందిరాన్ని నెలకొల్పినపుడు దివాకర్‌రెడ్డి వచ్చి దానిని ప్రారంభించి, తమను ప్రశంసించారని ప్రబోధానంద గుర్తు చేశారు.
Sat, Sep 22, 2018, 08:57 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View