మోదీ తక్షణం రాజీనామా చేయాలి: మల్లిఖార్జున ఖర్గే
Advertisement
మోదీ తక్షణం ప్రధాని పదవికి రాజీనామా చేసి కేబినెట్ మంత్రినెవరినైనా ప్రధానిగా నియమించాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రఫెల్ ఒప్పందంలో ప్రైవేటు పార్టీకి కాంట్రాక్ట్ కేటాయించడంపై మోదీ హస్తముందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతానికి ప్రధాని పదవికి మోదీ తగరన్నారు. బుధవారం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ రఫెల్ ఒప్పందంలో మోదీ హస్తముందని.. ఆయన అనిల్ అంబానీకి అండగా నిలిచారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. ఇప్పుడు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే ఆ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. దీనిని బట్టే డీల్ ఖరారు కోసం ప్రధాని తన మిత్రుడిని ఫ్రాన్స్‌కు తీసుకెళ్లినట్టు స్పష్టమవుతోందన్నారు.
Sat, Sep 22, 2018, 07:07 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View