‘ఫ్లిప్ కార్ట్ ’ శుభవార్త.. త్వరలో ‘ద బిగ్ బిలియన్ డే సేల్’
Advertisement
ఆన్ లైన్ వినియోగదారులకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ శుభవార్త చెప్పింది. త్వరలోనే ‘ద బిగ్ బిలియన్ డే సేల్’ నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఫ్లాట్ డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు సమాచారం. ‘ద బిగ్ బిలియన్ డే సేల్’ నిమిత్తం ఓ ప్రత్యేక పేజీని ‘ఫ్లిప్ కార్ట్’ తమ సైట్ లో కేటాయించింది. అయితే, ఈ సేల్ ఎప్పుడు ప్రారంభిస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. పండగ సీజన్ సందర్భంగా త్వరలోనే ఈ సేల్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

‘ద బిగ్ బిలియన్ డే సేల్’  నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో భాగస్వామ్యం ఏర్పరచుకోనున్నట్లు ‘ఫ్లిప్ కార్ట్’ తెలిపింది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో భాగస్వామ్యాన్ని మాత్రమే బహిర్గతం చేసిన ‘ఫ్లిప్ కార్ట్’, ఇతర బ్యాంకుల కార్డులపై కూడా ఆఫర్లు ప్రకటించనుంది.
Sat, Sep 22, 2018, 05:54 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View