మాధవి లేకుండా ఉండలేను.. నన్ను చంపితే బాగుండేది: సందీప్
Advertisement
హైదరాబాదులోని ఎర్రగడ్డలో కూతురు, అల్లుడిపై తండ్రి చేసిన హత్యాయత్నం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అల్లుడు సందీప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, కూతురు మాధవి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో, సందీప్ మాట్లాడుతూ, మాధవి తండ్రి మనోహరాచారి పక్కా ప్లాన్ తోనే దాడి చేశాడని చెప్పాడు. తన కూతురును చూడాలని ఉందంటూ ఆయన ఫోన్ చేస్తే ఎంతో సంతోషించామని, అందుకే ఆయన రమ్మన్న చోటుకు వెళ్లామని తెలిపాడు. ఆయన మాటలను నమ్మి గోకుల్ థియేటర్ వద్దకు వెళ్తే ఘోరానికి పాల్పడ్డాడని చెప్పాడు.

మనోహరాచారి తొలుత తనపై దాడి చేశాడని, తాను తప్పించుకోవడంతో మాధవిపై విచక్షణా రహితంగా దాడి చేశాడని సందీప్ తెలిపాడు. మాధవి లేకుండా ఉండలేనని... తనను చంపితే బాగుండేదని చెప్పాడు. తక్కువ కులంలో పుట్టడమే తాను చేసిన పాపమా? అంటూ కంటతడి పెట్టాడు. తాను ఎంతో ప్రేమించిన మాధవి లేకుండా ఉండలేనని చెప్పాడు. 
Thu, Sep 20, 2018, 11:38 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View