మరో రెండు రోజులు గడిస్తే గానీ చెప్పలేం... మాధవి హెల్త్ బులెటిన్ విడుదల!
Advertisement
ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ దగ్గర దాడికి గురైన మాధవి హెల్త్ బులెటిన్ ను యశోదా ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. మాధవికి ఇప్పటివరకూ 3 సర్జరీలు చేశామని వైద్యులు తెలిపారు. ముఖ కవళికలను మార్పులు చూపించే నరం తెగిపోయిందనీ, దానికి తొలి సర్జరీ చేశామని వెల్లడించారు. అలాగే మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నరానికి రెండో ఆపరేషన్, చేతికి మరో ఆపరేషన్ చేశామని పేర్కొన్నారు. రోడ్డుపై ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని వ్యాఖ్యానించారు.

మాధవి ఆరోగ్యంపై మరో రెండు రోజులు గడిస్తే గాని ఏమీ చెప్పలేమని యశోదా ఆసుపత్రి వైద్యులు బులెటిన్ లో తెలిపారు. యువతి శరీరంలో ముందుగానే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందనీ, తాజాగా ప్రమాదం నేపథ్యంలో మాధవికి 6 యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం మాధవిని వెంటిలేటర్ పై ఉంచామని పేర్కొన్నారు. తమ సూచనలకు మాధవి స్పందిస్తోందని వైద్యులు తెలిపారు.
Thu, Sep 20, 2018, 11:26 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View