మీ పేరును నిలబెడతాను తాతా!: అక్కినేని అఖిల్
Advertisement
ఎన్నో విభిన్నమైన పాత్రలలో జీవించి, అశేష ప్రేక్షకుల హృదయాలలో ఏఎన్నార్ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. హీరోలు తమకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకోవడమనేది అక్కినేనితోనే మొదలైందని చెప్పాలి. అలాంటి అక్కినేని జయంతి ఈ రోజు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అఖిల్ ఒక ట్వీట్ చేశాడు. "హ్యాపీ బర్త్ డే తాతా .. అక్కినేని అనే పేరును ప్రతిరోజు తలచుకుంటూనే వుంటాను. అక్కినేని అనే ఇంటిపేరును .. నట వారసత్వాన్ని మాకు ఇచ్చావు .. అది ఒక ఘనతగా నేను భావిస్తున్నాను. మీ పేరును నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. లవ్ ఫర్ ఎవర్ .. మిమ్మల్ని మిస్ అవుతున్నాము .. ఏఎన్నార్ లివ్స్ ఆన్" అంటూ తాత పట్ల తనకి గల ప్రేమానురాగాలను వ్యక్తం చేశాడు.    
Thu, Sep 20, 2018, 11:16 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View