డ్రంకెన్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు బ్రిడ్జిపై నుంచి దూకిన కారు డ్రైవర్.. వీడియో వైరల్
Advertisement
మందు కొట్టి కారు డ్రైవ్ చేస్తూ వెళ్తున్న వ్యక్తికి ఎదురుగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కనిపించాయి. ఏం చేయాలో తోచలేదు. వారికి దొరకడం కంటే తప్పించుకోవడం మేలని భావించాడు. కారును నడిరోడ్డుపైనే వదిలేసి బ్రిడ్జి పైనుంచి పరుగులు తీశాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు కార్లను లిఫ్ట్ అడిగాడు. ఎవరూ తమ వాహనాలను ఆపకపోవడంతో మరో మార్గం లేక బ్రిడ్జిపై నుంచి దూకేసి కిందున్న రోడ్డుపై పడ్డాడు.  

ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓ కాలు విరిగిపోయింది. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. తాను పూర్తిగా తాగి ఉన్నానని, బ్రీత్ టెస్ట్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి బ్రిడ్జి పైనుంచి దూకినట్టు చెప్పాడు.

Thu, Sep 20, 2018, 10:56 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View