గణేశ్ మండపం వెనకే.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం!
20-09-2018 Thu 10:39
- వినాయక మండపానికి వచ్చిన బాలికపై అఘాయిత్యం
- మాయమాటలతో మండపం వెనక్కి తీసుకెళ్లి ఘోరం
- పరారీలో నిందితుడు

వినాయకుడిని దర్శించుకునేందుకు మండపానికి వచ్చిన 13 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. 24 ఏళ్ల మండపాల కాంట్రాక్టర్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. మండపం వెనకే ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. మహారాష్ట్రలోని అగర్ గ్రామంలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్నేహితురాళ్లతో కలిసి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పిన నిందితుడు మండపం వెనకకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తనపై జరిగిన ఘాతుకాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు దహాను పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పలఘ్హర్ పోలీస్ స్టేషన్ అధికార ప్రతినిధి హేమంత్ కుమార్ కట్కర్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
More Latest News
తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
6 hours ago

దైవదూషణకు పాల్పడిన నుపుర్ శర్మకు తగిన బుద్ధి చెప్పండి: భారత ముస్లింలకు పిలుపునిచ్చిన అల్ ఖైదా
6 hours ago

నిజంగా మేము చాలా టెన్షన్ పడ్డాము: నిఖిల్
8 hours ago
