నయన్‌తో మాట్లాడి పెళ్లి విషయం చెబుతా: విఘ్నేశ్
Advertisement
అగ్ర కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమ వ్యవహారం గురించి... వారిద్దరూ నేరుగా మీడియాకు వెల్లడించకపోయినా, ఇద్దరూ తీయించుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలను విఘ్నేష్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నాడు.

తాజాగా ఆయన నయన్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నాడు. తాజాగా ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్‌తో పెళ్లి గురించి ప్రశ్నించగా.. ‘నాకు తెలియదు. తెలిస్తే మీకు చెబుతా. ముందు నయనతారను, ఆ తర్వాత మా అమ్మను అడిగి చెబుతా’ అంటూ చెప్పుకొచ్చాడు. 
Wed, Sep 19, 2018, 08:42 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View