ఆర్బిటేషన్ ట్రైబ్యునల్‌లో ఇన్ఫోకు ఊహించని దెబ్బ!
Advertisement
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌‌లో ఇన్ఫోకు చుక్కెదురైంది. అసలు విషయంలోకి వెళితే ఇన్ఫోసిస్‌కు సీఎఫ్‌వోగా పనిచేసిన రాజీవ్ బన్సాల్ 2015లో కంపెనీ నుంచి వైదొలిగారు. ఆ సమయంలో ఆయనకు సెవరెన్స్ ప్యాకేజీ కింద రూ. 17.38 కోట్లు కానీ, 24 నెలల జీతం కానీ చెల్లించేందుకు కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం తొలి విడతగా రూ.5.2 కోట్లు చెల్లించేసింది. కానీ ఆయనకు ఇస్తున్న ప్యాకేజీ చాలా ఎక్కువగా ఉందంటూ పలువురు అభ్యంతరం తెలపడంతో మిగతా చెల్లింపును కంపెనీ నిలిపివేసింది. దీంతో రాజీవ్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్.. మిగతా డబ్బును వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో తాము చెల్లించిన రూ.5.2 కోట్లను రాజీవ్ రిఫండ్ చేయాలని కోరుతూ ఇన్ఫోసిస్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని కూడా ట్రైబ్యునల్ కొట్టేసినట్టు ఇన్ఫీ తెలిపింది. దీనిపై తాము న్యాయ సలహా తీసుకోనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
Wed, Sep 19, 2018, 08:31 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View