మాధవి పరిస్థితి విషమం.. నడిరోడ్డుపై నరకడంతో ఇన్ఫెక్షన్!
Advertisement
తమ కంటే తక్కువ కులం వ్యక్తిని పెళ్లాడిందనే అక్కసుతో... హైదరాబాద్ ఎర్రగడ్డలో నవ వధూవరులను అమ్మాయి తండ్రి నరికి చంపేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మాధవి పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఎస్ఆర్ నగర్ లోని నీలిమ ఆసుపత్రిలో ఆమె భర్త సందీప్ కు చికిత్స జరుగుతోంది.

ఈ సందర్భంగా మాధవికి చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ, న్యూరో సర్జన్, కాస్మోటిక్ సర్జన్, వాస్క్యులర్ సర్జన్ ద్వారా ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.

ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని... మరో రెండు, మూడు రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. రోడ్డుపై దాడి జరగడంతో ఆమె శరీరానికి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారు. మెడపై బలంగా వేటు వేయడంతో... మెదడుకు అనుసంధానమై ఉండే నరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. బలమైన దెబ్బలు తగలడంతో, రక్తస్రావం ఎక్కువగా జరిగిందని వెల్లడించారు. ఎనిమిది గంటల పాటు ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. 
Wed, Sep 19, 2018, 07:34 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View