10వ తరగతి నుంచి మాధవి, సందీప్ ల మధ్య ప్రేమ.. నమ్మించి, హత్యాయత్నం చేసిన నరసింహాచారి
Advertisement
ప్రేమ వివాహం చేసుకున్న నూతన దంపతులను పరువు కోసం అమ్మాయి తండ్రి హత్య చేసేందుకు యత్నించిన ఘటన హైదరాబాదు, ఎర్రగడ్డలో కలకలం రేపుతోంది. బాధితురాలు మాధవిది బోరబండ. సందీప్ ది ఎర్రగడ్డ వద్ద ప్రేమ్ నగర్. ఈ రెండు ప్రాంతాలు దగ్గరగానే ఉంటాయి. వీరికి సంబంధించి సందీప్ కజిన్ అయిన ఒక వ్యక్తి వివరాలను అందించాడు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం... మాధవి, సందీప్ లు 10వ తరగతి నుంచే ప్రేమించుకుంటున్నారు. వారం క్రితం ఇద్దరూ ఒక గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాధవి తల్లిదండ్రులు సందీప్ ఇంటికి వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిరోజు మాధవి తండ్రి నరసింహాచారి వీరి వద్దకు వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. దీంతో, ఆయన ప్రవర్తనపై ఎవరికీ అనుమానం రాలేదు. ప్రేమ పెళ్లికి ఆయన అంగీకరించారనే అందరూ సంతోషపడ్డారు. ఈరోజు ఇద్దరికీ ఫోన్ చేసి రావాలని మాధవి తండ్రి పిలిచాడు. వారు వచ్చిన తర్వాత ఇంతటి ఘోరానికి తెగబడ్డాడు. తమ కన్నా తక్కువ కులం వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే... ఇద్దరినీ చంపేందుకు ఆమె తండ్రి యత్నించాడు.
Wed, Sep 19, 2018, 06:03 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View