ఉత్తరాఖండ్ అడవుల్లో ఏనుగును చంపి.. దంతాల చోరీ!
18-09-2018 Tue 17:06
- పునరావృతమైన 2001నాటి ఘటన
- మృతి చెందిన ఏనుగుకు పోస్టుమార్టం
- నివేదిక ఆధారంగా దర్యాప్తు
ఏనుగును చంపి దంతాలను చోరీ చేసిన ఘటన ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపుతోంది. 2001లో కూడా ఇక్కడి అటవీ ప్రాంతంలో ఇటువంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత అలాంటి ఘటనే పునరావృతమైంది.
ఉత్తరాఖండ్‌లోని శివాలిక్ అటవీ ప్రాంతంలో కొందరు దుండగులు 45 ఏళ్ల మగ ఏనుగును చంపి, దాని దంతాలను ఎత్తుకుపోయారు. ఈ విషయాన్ని డెహ్రాడూన్ అటవీశాఖాధికారి ధర్మసింగ్ మీణా స్వయంగా వెల్లడించారు. ఈ ఘటనలో మృతి చెందిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక ఆధారంగా అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.
More Latest News
దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానళ్లపై వేటు
49 minutes ago

తిరుమలలో రోజా హల్ చల్.. 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం
55 minutes ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
1 hour ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
1 hour ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
2 hours ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
2 hours ago
