ఫిలింనగర్‌లో బీభత్సం సృష్టించిన బస్సు.. 4 కార్లు, మూడు బైక్‌లు ధ్వంసం!
Advertisement
హైదరాబాద్‌, ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియో వద్ద బుధవారం రాత్రి ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవడంతో అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో నాలుగు కార్లు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. వాటిలో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బస్సు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉందని, షేక్‌పేట నుంచి రామానాయుడు స్టూడియోవైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Thu, Sep 13, 2018, 08:03 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View