సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  అందాల నయనతార తన పారితోషికాన్ని తాజాగా పెంచేసిందట. ఇటీవల రిలీజైన 'కొలమావు కోకిల' చిత్రం భారీ విజయాన్ని సాధించి సుమారు పాతిక కోట్లు వసూలు చేయడంతో, కథానాయిక నయనతార తన పారితోషికాన్ని 3 కోట్లు చేసిందని కోలీవుడ్ సమాచారం.
*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగులో హీరో సుమంత్ కూడా జాయిన్ అయ్యాడు. ఇందులో తను అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషిస్తున్నాడు. కాగా, ఇందులో చంద్రబాబు నాయుడుగా నటిస్తున్న రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేయగా, బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది.  
*  విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' తమిళ చిత్రం సూపర్ హిట్టయి సుమారు 200 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో, ఈ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం చైనీస్ వెర్షన్ ను డిసెంబర్ 6న విడుదల చేస్తారు.
Thu, Sep 13, 2018, 07:35 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View