మక్కా మసీదును తలపించేలా.. అమరావతిలో భారీ మసీదు!
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుమల ఆలయాన్ని పోలిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఆమోద ముద్ర పడగా, ఇప్పుడు భారీ మసీదును కూడా నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. మక్కా మసీదును తలపించేలా నిర్మించనున్న ఈ మసీదుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సీఆర్‌డీయే అధికారులను సీఎం ఆదేశించారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఆర్‌డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రజా రాజధానిని నిర్మించాలన్నదే తన ఆశయమని, భిన్న మతాలు, సంస్కృతులకు నిలయంగా రాజధానిని మార్చాలన్నది తన అభిమతమని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఓవైపు శ్రీవారి ఆలయం, మరోవైపు మసీదును నిర్మించడం ద్వారా ఆ సందేశాన్ని అందించనున్నట్టు తెలిపారు. అమరావతిలో నిర్మించబోయే మసీదు ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షిస్తుందన్నారు.
Thu, Sep 13, 2018, 07:16 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View