‘పట్టిసీమ’లో నారా లోకేశ్- బ్రాహ్మణి సెల్ఫీ ఇది!
Advertisement
పోలవరం గ్యాలరీ వాక్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్, తన సతీమణి బ్రాహ్మణితో కలిసి పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ తన మొబైల్ లో అందమైన దృశ్యాలను చిత్రీకరించారు. బ్రాహ్మణితో కలిసి లోకేశ్ ఓ సెల్ఫీ కూడా దిగారు. ఈ సెల్ఫీని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాలకు చేరింది.

ఇదిలా ఉండగా, పోలవరం గ్యాలరీ వాక్ కు వెళ్లిన లోకేశ్ ను మీడియా పలకరించగా ఆయన మాట్లాడుతూ, ‘ఇదొక చరిత్ర. ఎందుకంటే, భారతదేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే, ఒక తరం ప్లాన్ చేస్తుంది. రెండో తరం డిజైన్ చేస్తుంది. మూడో తరంలో శంకుస్థాపన, నాల్గో తరంలో నిర్మాణం.. ఐదో తరంలో ఓపెన్ చేస్తారు. అలాంటిది, కేవలం, నాలుగే నాలుగేళ్లలో పూర్తి చేస్తున్నాం. అధికారులు, కాంట్రాక్టర్లు.. అందరి సహకారం వల్ల ఈ ప్రాజెక్టు 58 శాతం పూర్తయింది. ‘పోలవరం’ ఆంధ్ర రాష్ట్రం జీవనాడి. దేవుడి దయవల్ల, ముఖ్యమంత్రి గారి దయవల్ల.. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ప్రాజెక్టును సందర్శించే అవకాశం కలిగింది. ఇలాంటి అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం’ అని సంతోషం వ్యక్తం చేశారు.
Wed, Sep 12, 2018, 08:06 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View