‘అరవింద సమేత’ కొత్త పోస్టర్ ఇది!
Advertisement
Advertisement
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం కొత్త పోస్టర్ విడుదలైంది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఈ చిత్రం కొత్త పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఓ ట్వీట్ లో పేర్కొంది. 

ఈ చిత్రానికి సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన పోస్టర్ అని, ‘అరవింద సమేత’ ఆడియో ఆల్బమ్ ను ఈ నెల 20న విడుదల చేస్తామని పేర్కొంది. ఈ వారంలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్  తెలియజేస్తామని  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెలిపింది. కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Wed, Sep 12, 2018, 06:43 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View