ఆ ఫైట్ మాస్టర్ ఉద్దేశపూర్వకంగా నన్ను 24 మెట్లపై నుంచి కిందకి లాగించాడు!: వరలక్ష్మి
Advertisement
ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలను చేస్తూ వరలక్ష్మి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి ఆమె తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించారు. "ఒక ఫైట్ మాస్టర్ కొన్ని సినిమాల నుంచి నన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఆయన ఫైట్ మాస్టర్ గా చేస్తోన్న 'అశ్వద్ధామ' సినిమాలో నేను కృష్ణగారికి చెల్లెలి పాత్ర చేశాను.

ఒక సీన్లో నేను తడిబట్టలతో 25 మెట్లు ఎక్కాలి .. అలాగే ఎక్కాను. 'అప్పుడు ఒక వ్యక్తి వెనక నుంచి నీ రెండు కాళ్లు పట్టుకుని రెండు మెట్లు కిందకి లాగుతాడు .. అతన్ని తన్నేసి నువ్వు పారిపోవాలి' అని నాకు ఫైట్ మాస్టర్ చెప్పాడు. కానీ ఫుల్ షాట్ పెట్టేసి .. ఒక బొమ్మలాగా 24 మెట్ల మీదుగా నన్ను కిందకి లాగించేశాడు. ఆ మెట్ల కింద వున్న సిమెంట్ దిమ్మ నడుముకి తాకేసింది. అప్పుడు నేను ఏడ్చిన ఏడుపుకి చుట్టుపక్కల వాళ్లంతా వచ్చేశారు. కావాలని చేసిన కారణంగానే ఆ ఫైట్ మాస్టర్ నాకు సారీ చెప్పాడు. అప్పట్లో నా వెనకాల బ్యాగ్రౌండ్ లేని కారణంగానే అలా చేశాడు' అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.     
Wed, Sep 12, 2018, 06:37 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View