వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర' మూవీ రిలీజ్ డేట్ ఖరారు!
Advertisement
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా రూపొందుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడంలో ఆయన చేసిన పాదయాత్ర ప్రధానమైన పాత్రను పోషించింది. ఆయన చేసిన పాదయాత్ర .. ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. అందువల్లనే ఆయన బయోపిక్ గా 'యాత్ర' రూపొందుతోంది. వైఎస్ గా మమ్ముట్టి నటిస్తోన్న ఈ సినిమాకి, మహి.వి రాఘవ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

 ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను వైఎస్ జగన్ పుట్టినరోజైన డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ కి .. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అందువలన సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి విశేషాలు బయటిరాకుండా చూసుకుంటూ ఉండటంతో, అందరిలోను మరింతగా ఆసక్తి పెరుగుతూ పోతోంది. ఈ సినిమా అన్నివర్గాల వారి ఆదరణను పొందుతుందనే నమ్మకంతో వైఎస్ అభిమానులు వున్నారు.       
Wed, Sep 12, 2018, 06:01 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View