అఖిల్ మూవీలో కీలకమైన రోల్ లో కాజల్?
Advertisement
ప్రస్తుతం అఖిల్ తన మూడవ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. గతంలో అఖిల్ చేసిన రెండు సినిమాలు ఆయనకి ఆశించిన స్థాయి విజయాన్ని అందివ్వలేకపోయాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండా ఆయనకి హిట్ ఇవ్వాలని దర్శకుడు వెంకీ అట్లూరి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అఖిల్ ను కొత్తగా చూపించడమే కాకుండా .. కథాకథనాల్లోను కొత్తదనాన్ని చూపించే పనిలో ఆయన వున్నాడు.

నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ ఒక కీలకమైన రోల్ చేస్తోందనేది తాజా సమాచారం. ఆడియన్స్ ను థ్రిల్ చేయడం కోసం ఈ విషయాన్ని యూనిట్ వారు సీక్రెట్ గా వుంచినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ ఏమై ఉంటుంది? ఆమె పాత్రను వెంకీ అట్లూరి ఎలా డిజైన్ చేసి ఉంటాడు? అనేది ఆసక్తిని రేకెత్తించే విషయమే. 'మిస్టర్ మజ్ను' టైటిల్ తో ఈ సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు.  
Wed, Sep 12, 2018, 05:03 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View