అప్పట్లో నేను సినిమాలు మానేయడానికి ఒక బలమైన కారణం వుంది: వరలక్ష్మి
Advertisement
కూతురు పాత్రలను .. చెల్లెలి పాత్రలను వరుసగా చేస్తోన్న వరలక్ష్మి, ఒక్కసారిగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. అందుకు ఒక బలమైన కారణం ఉందంటూ తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. 'చిట్టెమ్మ మొగుడు' సినిమాలో నేను దివ్యభారతి స్నేహితురాలిగా చేశాను. ఈ సినిమాలో నిండు గర్భవతినైన నేను జారిపడిపోవాలి. ఆ షాట్ ని ఒకసారి తీశారు .. సరిగ్గా రాలేదని చెప్పేసి రెండవసారి తీశారు.

అలా ఆ షాట్ ను 11 టేకులు చేశారు. ఇక నా వల్ల కాలేదు .. కూర్చుని ఏడుస్తున్నాను. 'ఏమైందమ్మా దెబ్బ తగిలిందా?' అని కోదండరామిరెడ్డి అడిగారు. 'నేను ఇన్నిసార్లు పడిపోకూడదు సార్ .. నిజంగానే నేను గర్భవతిని .. కడుపులో వున్న బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని భయంగా వుంది సార్' అని చెప్పాను. ఆ మాట వినగానే ఆయన చాలా బాధపడిపోయారు. 'ఈ విషయం ముందుగానే చెప్పొచ్చు కదమ్మా' అంటూ అప్పటివరకూ తీసిన షాట్స్ లో నుంచి ఒక దానిని ఓకే చేశారు. కడుపులో వున్న బిడ్డ కోసం .. ఆ బిడ్డ సంరక్షణ కోసం కొంతకాలం బ్రేక్ తీసుకోవడమే బెటర్ అని నిర్ణయించుకుని .. మానేశాను" అని చెప్పుకొచ్చారు.  
Wed, Sep 12, 2018, 04:36 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View