క్యాష్ బ్యాక్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో!
Advertisement
టెలికాం రంగంలో తమ వినియోగదారులకు రకరకాల ఆఫర్ లు ప్రకటిస్తూ సంచలనాలు సృష్టించే జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఫోన్‌పే యాప్ ద్వారా రూ.300 లేదా అంతకన్నా ఎక్కువ విలువ గల రీఛార్జి చేసుకుంటే రూ.50 క్యాష్‌బ్యాక్‌ పొందుతారని జియో తెలిపింది.

 రీఛార్జి చేసుకున్న 24 గంటలలో ఈ క్యాష్‌బ్యాక్‌ తమ యాప్ వాలెట్ లో క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయిన ఈ క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులు ఇతర రీఛార్జిలకు లేదా ఏదైనా బిల్ పేమెంట్స్‌కు ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 21 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుండగా, వినియోగదారుడు కేవలం ఒకసారి మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Wed, Sep 12, 2018, 04:20 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View