విజయ్ దేవరకొండ మూవీలో మురుగదాస్!
Advertisement
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గీత గోవిందం' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, ఆయన తదుపరి సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమాగా 'నోటా' రావడానికి రెడీ అవుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. రాజకీయాల నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో మురుగదాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. మురుగదాస్ దగ్గర దర్శకత్వ శాఖలో ఆనంద్ శంకర్ పనిచేశాడు. అందువలన ఆయన మురుగదాస్ ను గురువుగా భావిస్తుంటాడు. తాను దర్శకత్వం వహించే సినిమాలో మురుగదాస్ కి ఒక పాత్రను ఇచ్చి, ఆయనను డైరెక్ట్ చేయాలనే ఆశ ఆనంద్ శంకర్ కి చాలాకాలం నుంచి ఉందట.

ఇక శిష్యుడి ముచ్చట తీర్చడం కోసం మురుగదాస్ ఈ సినిమాలో చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. విజయ్ దేవరకొండకి తమిళంలోను ఈ సినిమా మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
Wed, Sep 12, 2018, 04:04 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View