రాజబాబుగారు చేసిన సాయం ఎప్పటికీ మరిచిపోలేను: సీనియర్ నటి వరలక్ష్మి
Advertisement
తాజాగా 'ఆలీతో సరదాగా ' కార్యక్రమంలో వరలక్ష్మి మాట్లాడుతూ, 'జీవనజ్యోతి' సినిమాను గురించిన విషయాలను ప్రస్తావించారు. "ఈ సినిమాలో శోభన్ బాబు .. వాణిశ్రీకి కొడుకుగా డ్యూయెల్ రోల్ చేశాను. ఈ పాత్ర కోసం ముందుగా నన్ను పిలిపించి .. సన్నగా వున్నానని చెప్పి వద్దన్నారు. ఆ తరువాత నా చురుకుదనం చూసి ఓకే చెప్పారు.

ఈ సినిమా షూటింగు ఊటీలో జరుగుతోంది. ఆ చలికి నేను తట్టుకోలేకపోతున్నాను. నా పరిస్థితి చూసిన రాజబాబు 'ఏవయ్యా పాపకి స్వెట్టర్ అయినా వేయవా నువ్వు' అని మా నాన్నగారిని అడిగారు. 'తీసుకుంటాను సార్ .. తీసుకుంటాను' అంటూ మా నాన్నగారు మా పరిస్థితి చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. 'నాకు అర్థమైందిలే ఇదిగో ఈ స్వెట్టర్ తీసుకో' అని మా నాన్నకి తన స్వెట్టర్ ఇచ్చారు.

ఆ తరువాత కాస్ట్యూమర్ ను పిలిచి ఈ సినిమాలో ఈ పాపకు వేసే ప్రతి డ్రెస్ ఆ పాపకి ఇచ్చేయవలసిందే' అని చెప్పారు. తన డబ్బుతో కొత్త స్వెట్టర్ తెప్పించి నాకు వేయించారు .. ఆ తరువాత ఆ స్వెట్టర్ ను మా పాపకి కూడా వేశాను .. నాకు ఊహ తెలిసిన తరువాత రాజబాబుగారిది ఎంత హెల్పింగ్ నేచర్ అనేది తెలిసింది" అని చెప్పుకొచ్చారు.  
Wed, Sep 12, 2018, 03:43 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View