నా మనవడు దేవాన్ష్ ను పోలవరంకు తీసుకురావడానికి కారణం ఇదే: చంద్రబాబు
Advertisement
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు ఒక వరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యార్థులతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం నిర్మాణాన్ని ఒకసారి చూస్తే అందరికీ అవగాహన వస్తుందని చెప్పారు. అందుకే తన మనవడు దేవాన్ష్ ని కూడా ఈ రోజు పోలవరం ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చానని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల్లో పిల్లలు కూడా భాగస్వాములైతే వారిలో ఒక స్ఫూర్తి ఉంటుందని, ఒక ఆలోచన ఉంటుందని... అందుకే అతన్ని కూడా తీసుకొచ్చానని చెప్పారు. పోలవరం అనేది ఒక చరిత్ర అని, ఈ చరిత్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. 
Wed, Sep 12, 2018, 03:42 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View