కేసీఆర్ జాతకమేంటో ప్రజలకు తెలుసు!: జగ్గారెడ్డి భార్య నిర్మలారెడ్డి
Advertisement
సంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న జగ్గారెడ్డిని ఆయన భార్య నిర్మలారెడ్డి ఈరోజు కలిశారు. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, జగ్గారెడ్డి చరిత్ర ఏంటో, కేసీఆర్ జాతకం ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. టీఆర్ఎస్ నేతలు అధికార దాహంతోనే జగ్గారెడ్డిని అరెస్టు చేయించారని నిప్పులు చెరిగారు. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ మైనారిటీల సభకు అనుమతి

సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న మైనారిటీల సభకు పోలీసులు అనుమతించారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మదీనాచౌక్ లో ఈ సభ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు వెంకటేశ్వరస్వామి గుడి నుంచి వాహన ర్యాలీ నిర్వహించనున్నారు. జగ్గారెడ్డి అరెస్టు నేపథ్యంలో ఈరోజు జరగనున్న ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది.
Wed, Sep 12, 2018, 03:19 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View