రాముడి పేరుతో పీఠమెక్కి.. ముస్లిం వకాల్తాదారుగా వ్యవహరిస్తారా?: ప్రధాని మోదీపై తొగాడియా ఫైర్
Advertisement
విశ్వ హిందూ పరిషత్(వీహెచ్ పీ) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాక్ దురాచారం నిర్మూలనకు మోదీ ప్రభుత్వం చట్టం తీసుకురావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ మినీ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. యూపీలోని మధురలో జరిగిన ఓ సమావేశంలో తొగాడియా మాట్లాడారు.

నరేంద్ర మోదీ ముస్లింల తరఫున వకాల్తా దారు(న్యాయవాది)గా వ్యవహరిస్తున్నారని తొగాడియా దుయ్యబట్టారు. ట్రిపుల్ తలాక్ అన్నది ముస్లింల వ్యక్తిగత విషయమని, అందులో మోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో నెగ్గిన ఆయన, హిందూ దేశ పరిరక్షణ, కశ్మీర్ లోని హిందువులను రక్షించడం లేదని ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా అయోధ్యలో రామమందిరం నిర్మించకపోవడం మోదీ అసమర్ధతకు నిదర్శనమని అన్నారు.
Wed, Sep 12, 2018, 02:52 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View