బంటీ సాహసాలతో ఆసక్తిని రేపుతోన్న 'అదుగో' ట్రైలర్
Advertisement
నటుడిగా .. దర్శకుడిగా రవిబాబు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. అలా రచయితగా .. దర్శకుడిగా ఆయన నుంచి వచ్చిన చిత్రమే 'అదుగో'. పందిపిల్ల ప్రధానపాత్రగా నడిచే కథ ఇది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు.

"హార్ట్ టచింగ్ లవ్ .. థ్రిల్లింగ్ సస్పెన్స్ .. పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ .. ఎమోషన్ .. ధమాకా డాన్స్" అంటూ అందుకు సంబంధించిన దృశ్యాలను చూపించారు. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అంటూ పందిపిల్ల చేసే సాహస విన్యాసాలను చూపించారు. రౌడీల బారి నుంచి తప్పించుకుంటూ .. వాళ్లపై అది ఎదురుదాడి చేసే తమాషా సీన్స్ కూడా ఇందులో వున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్టుగా చెప్పారు.  
Wed, Sep 12, 2018, 02:31 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View