మొదటి సినిమాలో ఛాన్స్ రమాప్రభగారి వలన వచ్చింది: సీనియర్ నటి వరలక్ష్మి

    

Advertisement
అటు వెండితెరపై .. ఇటు బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నటన పట్ల మా నాన్నగారికి ఎక్కువ ఆసక్తిగా ఉండేది .. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా వేశారు. అయితే ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. నా చిన్నప్పుడు ఒక రోజున ఆయన తనతో పాటు నన్ను కూడా షూటింగుకి తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ రమాప్రభగారు నన్ను చూశారు.

'పాప చాలా ముద్దుగా వుంది .. బేబీ ఆర్టిస్టులు చాలా తక్కువగా వున్నారు .. మీ పాపను యాక్ట్ చేయించవచ్చుగదా .. ఆ పక్కనే షూటింగు జరుగుతోంది కదా .. వాళ్లకి బేబీ ఆర్టిస్ట్ కావాలట .. ఒకసారి వెళ్లి వాళ్లకి మీ పాపను చూపించండి' అని నాన్నగారితో అన్నారట. దాంతో నాన్నగారు వెళ్లి నన్ను చూపించారు .. ఆ రోజు వచ్చిన చాలామంది పిల్లలలో నుంచి వాళ్లు నన్ను సెలెక్ట్ చేశారు .. అదే 'అందాల రాముడు' సినిమా' అని ఆమె చెప్పుకొచ్చారు.       
Wed, Sep 12, 2018, 01:41 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View