ఎలుకల మందుతో బ్రష్ చేసుకున్న మహిళ.. ఆసుపత్రిలో మృతి
Advertisement
ఎలుకలను చంపేందుకని తెచ్చిన మందు ఆ ఇంటి ఇల్లాలినే మింగేసింది. టూత్‌ పేస్ట్‌ అనుకుని ఎలుకల మందు బ్రష్‌పై వేసి పళ్లు తోముకోవడంతో ప్రమాదం సంభవించింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన కొమ్ము మరియమ్మ ఈనెల 7వ తేదీన ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. కాసేపటికి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.

తర్వాత పరిస్థితి విషమించడంతో గుంటూరు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరియమ్మ మంగళవారం మృతి చెందింది. ఆమెకు భర్త దశరథ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా, మరియమ్మకు గత కొద్దికాలంగా మతిస్థిమితం కోల్పోయినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Wed, Sep 12, 2018, 01:25 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View