మినీ వ్యాన్ నుంచి దించుతుండగా పేలిన బాణసంచా.. ముగ్గురు సజీవదహనం!
Advertisement
తమిళనాడులోని ఈరోడ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఇక్కడి శాస్త్రీ నగర్ లోని పిళ్లయార్ రోడ్డులో ఓ మినీ వ్యాన్ నుంచి ఉదయం 6.60 గంటల సమయంలో బాణసంచాను దించుతుండగా ఒక్కసారిగా ఘర్షణ చెలరేగి టపాసులు పేలిపోయాయి. ఈ ఘటనలో బాణసంచాను అన్ లోడ్ చేస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ఉన్న ఐదు ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, ఓ అపార్ట్ మెంట్ భవనం దెబ్బతింది. సమీపంలోని పలు వాహనాలు కూడా తుక్కుతుక్కయ్యాయి.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దీపావళి పండుగ వేళ అమ్మకాల కోసం వీటిని ఓ వ్యాపారి తెప్పించాడని పోలీసులు తెలిపారు. బాణసంచాను అమ్మేందుకు సదరు వ్యాపారికి లైసెన్స్ ఉందా? లేదా? అన్న విషయమై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామనీ, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.
Wed, Sep 12, 2018, 03:13 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View