ఐపీఎల్‌-2019 వేదికగా దక్షిణాఫ్రికా లేదా యూఏఈ?
Advertisement
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2019 మ్యాచ్‌ల వేదిక మారే అవకాశం ఉందని భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండలి వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి. ‘కచ్చితంగా అని చెప్పలేం కానీ, భారత్‌ ఆవల ఈసారి మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్‌ లను దక్షిణాఫ్రికా లేదా యూఏఈ వేదికల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ముందస్తు సన్నాహాలు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు, మ్యాచ్‌లు ఒకేసారి జరిగితే భద్రతా పరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ఈ ఆలోచన చేస్తోంది. గతంలోనూ 2009లో దక్షిణాఫ్రికాలోను, 2014లో సగం మ్యాచ్‌లు యూఏఈలోనూ నిర్వహించారు. ‘ఏమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాకే వేదిక, తేదీలు ఖరారు చేస్తాం’ అని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌శుక్లా చెప్పారు. 
Wed, Sep 12, 2018, 01:03 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View