బాల్క సుమన్ ప్రచారాన్ని అడ్డుకున్న ఓదేలు అనుచరులు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కార్యకర్త.. ఉద్రిక్తత!
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు టికెట్ ను ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించడం నియోజకవర్గంలో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలు అనుచరులు తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇందారంలో ఈరోజు బాల్క సుమన్ ప్రచారాన్ని ఓదేలు మద్దతుదారులు అడ్డుకున్నారు. తమ నేతకే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో ముగ్గురికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. బాల్క సుమన్ కు వ్యతిరేకంగా ఓదేలు మద్దతుదారులు నినాదాలు చేశారు.
Wed, Sep 12, 2018, 12:56 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View