ఇలా గ్లాసులోపోసి అలా తిప్పేస్తాడు.. చిటికెలో టీ రెడీ!
Advertisement
టీ కాఫీలు స్వల్ప ఉత్ప్రేరకాలు. ఉత్సాహాన్నిచ్చే సాధనాలు. ఉదయాన లేవగానే టీ తాగందే కొందరికి ఏమీ తోచనట్లుంటుంది. కొందరికి బెడ్‌ టీ అలవాటు. అందుకే దేశవ్యాప్తంగా టీకి అంత ప్రాచుర్యం. ఈ టీ తయారీకి ప్రత్యేక నైపుణ్యం అవసరం అంటారు దాని ప్రేమికులు. హైదరాబాద్‌ ఇరానీఛాయ్‌ అంత ప్రాచుర్యం పొందడానికి ఈ ప్రత్యేకతే కారణమని చెబుతారు.

 టీ తయారీలో కేరళీయులది ఇంకో ప్రత్యేకత. అటువంటి ప్రత్యేకతతోనే ఆకట్టుకుంటున్నాడు కేరళకు చెందిన ఈ ఛాయ్‌వాలా. పొన్నాని ప్రాంతంలో టీ దుకాణం నడుపుతున్న ఈ వ్యక్తి డికాక్షన్‌, క్రీమ్‌, పాల నురగను ఒక గ్లాస్‌లో పోసి క్షణ కాలం పాటు గ్లాస్‌ను తలకిందులుగా తిప్పి టీగా మారుస్తుండడం ఆకట్టుకుంటోంది. ఇతను టీ తయారీని ఓ ఔత్సాహికుడు వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో, స్వల్ప వ్యవధిలోనే దానిని లక్షల మంది చూశారు. అదీ ఈ టీ వాలా స్పెషాలిటీ!
Wed, Sep 12, 2018, 12:27 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View